TGSRTC: ఫేక్ వెబ్‌సైట్ ని ఇలా గుర్తించండి..! వీసీ సజ్జనార్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
ఫేక్ వెబ్‌సైట్స్(Fake Websites) నమ్మి అమాయక ప్రజలు లక్షల్లో మోసపోతున్నారని, వాటిని ఈ విధంగా గుర్తించండి అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(TGSRTC MD VC Sajjanar) వివరించారు.

దిశ, వెబ్ డెస్క్: ఫేక్ వెబ్‌సైట్స్(Fake Websites) నమ్మి అమాయక ప్రజలు లక్షల్లో మోసపోతున్నారని, వాటిని ఈ విధంగా గుర్తించండి అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(TGSRTC MD VC Sajjanar) వివరించారు. ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ(Technology) పెరగడంతో పాటు సైబర్ నేరాలు(Cyber Crimes) కూడా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు పలు టెక్నాలజీని ఉపయోగించుకొని నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి అమాయక ప్రజలను దోచేస్తున్నారు. అయితే ఈ నకలీ వెబ్‌సైట్లను గుర్తించడంలో అవగాహన కల్పించేందుకు సజ్జనార్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. నకిలీ వెబ్‌సైట్- ఒరిజినల్ వెబ్‌సైట్(Original Website) మధ్య తేడా(Difference)ను గుర్తించలేక అమాయక ప్రజలు సైబర్ వలలో చిక్కుకుంటున్నారని, లక్షల్లో మోసపోతున్నారని తెలిపారు. అలాగే ఏదైనా వెబ్‌సైట్ పేరులో యూఆర్ఎస్(URL) ఉంటే కచ్చితంగా దీనికి ముందు హెచ్‌టీటీపీ(HTTP) అని ఉంటుందని, అలా లేదంటే అది నకిలీ వెబ్ సైటేనని స్పష్టం చేశారు. అంతేగాక వెబ్‌సైట్ ఓపెన్ చేసిన వెంటనే మరో వెబ్ సైట్ కి వెళుతుంటే కచ్చితంగా అది నకిలీదని గమనించాలని సూచించారు. ఇక అనుమానాస్పద వెబ్ సైట్ లపై 1930 కి ఫిర్యాదు చేయండి అని సజ్జనార్ చెప్పారు.