TGPSC : పాలిటెక్నిక్ లెక్చ‌ర‌ర్స్ పోస్టుల భర్తీపై TGPSC బిగ్ అప్డేట్..!

పాలిటెక్నిక్ లెక్చ‌ర‌ర్స్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కసరత్తు మొదలు పెట్టింది.

Update: 2024-08-07 14:23 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పాలిటెక్నిక్ లెక్చ‌ర‌ర్స్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో.. సెప్టెంబ‌ర్ 20 నుంచి స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ మొదలు పెడుతామని TGPSC ఓ ప్రకటనలో తెలిపింది. అయితే స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు నార్మల్ అభ్య‌ర్థుల‌ను 1:2 నిష్ప‌త్తిలో , పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌ను 1:5 నిష్ప‌త్తిలో పిలిచినట్లు అధికారులు వెల్లడించారు.

కాగా .. సెప్టెంబ‌ర్ 20 నుంచి 26వ తేదీ వ‌ర‌కు అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల స‌ర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తామని, హైద‌రాబాద్ నాంప‌ల్లిలోని టీజీపీఎస్సీ కార్యాల‌యంలో ప్ర‌తి రోజు ఉద‌యం 10:30 గంట‌ల‌కు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ ప్రారంభం కానుందని తెలిపింది. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు క్వాలిఫై అయిన అభ్య‌ర్థుల జాబితాను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన‌ట్లు అధికారులు తెలిపారు . క్వాలిఫై అయిన ప్రతి అభ్యర్థి క‌మిష‌న్ వెబ్‌సైట్ నుంచి చెక్ లిస్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించారు. చెక్ లిస్ట్‌లో ఉన్న ప్ర‌తి పేపర్ పై గెజిటెడ్ ఆఫీస‌ర్ సంత‌కం ఉండాలని, త‌ప్ప‌నిస‌రిగా ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్లు తీసుకురావాల‌ని అభ్య‌ర్థులకు TGPSC అధికారులు సూచించారు.


Similar News