BREAKING: గ్రూప్-2 పరీక్ష వాయిదా.. అధికారిక ప్రకటన చేసిన TGPSC

గ్రూప్- 2 అభ్యర్థుల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. వరుసగా పలు ప్రభుత్వ ప్రవేశ పరీక్షలు ఉన్న నేపథ్యంలో గ్రూప్-2 ఎగ్జామ్‌ను వాయిదా

Update: 2024-07-19 14:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్- 2 అభ్యర్థుల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. వరుసగా పలు ప్రభుత్వ ప్రవేశ పరీక్షలు ఉన్న నేపథ్యంలో గ్రూప్-2 ఎగ్జామ్‌ను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా నిరుదోగ్యులు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సచివాలయంలో భేటీ అయిన గ్రూప్-2 అభ్యర్థులు ఎగ్జామ్‌ను వాయిదా వేయాలని కోరారు. అభ్యర్థుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసేందుకు అంగీకరించింది. ఈ మేరకు గ్రూప్-2 పరీక్షను పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీస్‌సీ) అధికారికంగా ప్రకటించింది. టీజీ‌పీఎస్‌సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ఈ మేరకు  శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్ట్ 7, 8 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తిరిగి పరీక్షను ఈ ఏడాది చివర డిసెంబర్‌లో కండక్ట్ చేస్తామని తెలిపారు. గ్రూప్-2 ఎగ్జామ్ కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. 

 


Similar News