TGPSC మరో బిగ్ అనౌన్స్మెంట్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3 అభ్యర్థులకు మరో ప్రకటన జారీ చేసింది.

Update: 2024-10-11 10:12 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3 అభ్యర్థులకు మరో ప్రకటన జారీ చేసింది. నవంబర్ 17, 18న జరగబోయే గ్రూప్ 3 పరీక్షల హాల్ టికెట్ల జారీ తేదీలను ప్రకటించింది. నవంబర్ 10వ తేదీ నుంచి హాల్ టికెట్స్ విడుదల చేస్తామని తెలిపింది. గ్రూప్ 3 పరీక్షల్లో మొత్తం మూడు పేపర్లు ఉండగా.. నవంబర్ 17వ తేదీ ఉదయం పూట జనరల్ స్టడీస్.. మధ్యాహ్నం పూట హిస్టరీ, పాలిటీ, సొసైటీ పరీక్ష జరగనుంది. 18వ తేదీ ఎకానమీ&అభివృద్ది సంబంధిత పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన నమూనా ఓఎంఆర్ పత్రాలను కమిషన్ వెబ్సైట్ లో ఉంచింది. అలాగే హాల్ టికెట్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. కాగా 2022 డిసెంబర్ 30న 13375 గ్రూప్ 3 భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది.  


Similar News