TG High Court: భూదాన్ భూముల వ్యవహారం.. అమోయ్ కుమార్‌పై హైకోర్టు సెన్సేషనల్ కామెంట్స్
ప్రభుత్వ (Government), భూదాన్ (Bhoodhan) భూములను అప్పనంగా తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ (IAS Amoy Kumar)పై ఇప్పటికే ఈడీ (ED) విచారణను వేగవంతం చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ (Government), భూదాన్ (Bhoodhan) భూములను అప్పనంగా తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ (IAS Amoy Kumar)పై ఇప్పటికే ఈడీ (ED) విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ఆయనపై తాజాగా తెలంగాణ (Telangana High Court) హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భూదాన్ భూములని ఆర్డీవో ఇచ్చిన రిపోర్టును అప్పిలేట్ ట్రైబ్యునల్ అథారిటీ హోదాలో ధ్రువీకరించిన వ్యక్తే.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న అమోయ్ కుమార్ వారసత్వ ధ్రువీకరణ ప్రతం జారీ చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు తెలిసి ఆనాడు నిజాం రాజు కూడా ఇంతలా ఆస్తులను ఎవరికీ అప్పనంగా కట్టబెట్టలేదంటూ జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ధర్మాసనం ఆక్షేపించింది. ఇప్పటికే అమోయ్ కుమార్ ఈడీ, సీబీఐ కేసులల్లో విచారణను ఎదర్కొంటున్నారని, ఆయన పేరు కూడా ప్రముఖంగా పత్రికలు, మీడియాలో వస్తున్నాయన కోర్టు వ్యాఖ్యానించింది.