TG Govt.: నేడు మూడో విడత రుణమాఫీ.. మరికొద్దిసేపట్లోనే మోగనున్న మొబైల్ ఫోన్లు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రైతులను రుణ విముక్తులను చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ మూడో విడత రుణమాఫీ అమలు చేయబోతోంది.

Update: 2024-08-15 03:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రైతులను రుణ విముక్తులను చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ మూడో విడత రుణమాఫీ అమలు చేయబోతోంది. ఆగస్టు 15 లోపు రైతులకు ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ సర్కార్ అనుకున్నట్లుగానే ఆ మాటను నిలబెట్టుకోబోతోంది. నేడు ఖమ్మం జిల్లా వైరా వేదికగా నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రూ.2 లక్షల రుణాలు ఉన్న సుమారు 6 లక్షల మంది రైతులకు రూ.6 వేల కోట్లకు పైగా ప్రభుత్వం రుణమాఫీ చేయబోతోంది.TG Govt.: నేడు మూడో విడత రుణమాఫీ.. మరికొద్దిసేపట్లోనే మోగనున్న మొబైల్ ఫోన్లు

కాగా, గత నెల18న మొదటి విడతలో భాగంగా రూ.లక్ష వరకు పంట రుణాలు ఉన్న 11.14 లక్షల మంది రైతులకు రూ.6,034.97 కోట్ల మేర రుణాలను సర్కార్ మాఫీ చేసింది. గత నెల 30న సెకండ్ ఫేజ్‌లో భాగంగా రూ.1.5 లక్షల వరకు ఉన్న పంట రుణాలకు గాను రూ.6.40 లక్షల మంది రైతులకు రూ.6,190 కోట్ల మేర రుణాలను మాఫీ చేసింది. ఈ క్రమంలో రైతులు ఎప్పుడెప్పుడు తమ ఖాతాలో డబ్బులు పడతాయా.. అప్పుల నుంచి తమకు ఎప్పుడు విముక్తి లభిస్తుందా అని వేచి చూస్తున్నారు.

Tags:    

Similar News