TG Budget 2024-25: బడ్జెట్‌లో GHMC, HMDAలకు అగ్ర తాంబూలం.. ఎన్ని వేల కోట్ల నిధులు కేటాయించారంటే?
హైదరాబాద్ మహానగర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ క్రమంలోనే 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేవ పెట్టిన బడ్జెట్‌లో అధిక నిధులను కేటాయించింది. ప్రపంచ స్థాయిలో హైదారాబాద్ నగర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు సర్కార్ నడుం బింగించింది. ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు, జీహెచ్ఎంసీ పరిధిలోని మెట్రో వాటర్ వర్క్స్ కోసం రూ.3385 కోట్లు, తాజాగా సీఎం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న హైడ్రాకు రూ.200 కోట్లను కేటాయించారు. ఇక ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కోసం రూ.200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం రూ.500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌కు రూ.200 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం రూ.1,500 కోట్లు, హెచ్ఎండీఏ కోసం రూ.10 వేల కోట్లను కోటాయించారు.