TG Budget 2024-25: కాంగ్రెస్ మాట శిలాశాసనం.. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్‌కు భట్టి స్ట్రాంగ్ కౌంటర్
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో రూ.72,659 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. వాటిని రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలకు, ఉద్యాన పంటలు, ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వినియోగించనున్నారు. ఓ వైపు మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌పై ప్రసంగిస్తుండగా రైతు రుణమాఫీపై బీఆర్ఎస్నే నేతలు రన్నింగ్ కామెంటరీ చేశారు. దీంతో మంత్రి భట్టి బీఆర్ఎస్ నేతలకు చురకలింటించారు. రుణమాఫీపై బీఆర్ఎస్, బీజేపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రుణ మాఫీకి రూ.31 వేల కోట్ల నిధులను సమీకరిస్తున్నామని బదులిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే పూర్తిస్థాయి రుణమాఫీ చేసి తీరుతామని, కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలాశాసనమేనని భట్టి విక్రమార్క విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు.
Read more : ఇల్లు లేని వారికి కాంగ్రెస్ సర్కారు గుడ్ న్యూస్