TG Budget 2024 - 2024 : ఇల్లు లేని వారికి కాంగ్రెస్ సర్కారు గుడ్ న్యూస్

ఇల్లు లేని వారికి కాంగ్రెస్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-07-25 07:31 GMT
TG Budget 2024 - 2024 : ఇల్లు లేని వారికి కాంగ్రెస్ సర్కారు గుడ్ న్యూస్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఇల్లు లేని వారికి కాంగ్రెస్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై కీలక ప్రకటన చేసింది. ఇండ్లు కట్టుకోవాలనుకునే పేదలకు రూ.5లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.6లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజవర్గంలో కనీసం 3,500 ఇండ్ల చొప్పున మొత్తం 4,50,000 ఇండ్ల నిర్మాణానికి సహకారం అందించానలి నిర్ణయించినట్లు తెలిపింది. ఈ పథకం కింద నిర్మించే ఇండ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఆర్, సీసీ కప్పుతో వంటగది, టాయిలెట్ సౌకర్యం ఉంటాయని తెలిపింది. రెండు పడక గదుల ఇండ్ల పథకం కింద పూర్తయిన ఇండ్లను త్వరలోనే కేటాయిస్తామని ప్రకటించింది. పూర్తి కానీ ఇండ్లను సత్వరమే పూర్తి చేసి మౌలిక వసతులను కల్పించి అర్హులకు అందజేస్తామని పేర్కొంది.  


కేంద్ర బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం.. ఢిల్లీలో టీ కాంగ్రెస్ ఎంపీలు 

Tags:    

Similar News