TG Assembly : మద్యం అంశంలో హరీష్ రావు Vs డిప్యూటీ సీఎం భట్టి మాటల యుద్ధం

శాసనసభలో బడ్జెట్ పద్దుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు వర్సెస్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం నడించింది.

Update: 2024-07-27 05:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: శాసనసభలో బడ్జెట్ పద్దుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు వర్సెస్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం నడించింది. తొలుత హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు బీఆర్ఎస్ టార్గెట్‌గానే బడ్జెట్ ప్రసంగం ఉందన్నారు. ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావుకు బడ్జెట్ అంటే కంటగింపులా ఉందన్నారు. ఎంత దొరికితే అంత దోచుకోవాలనే ఆలోచన బీఆర్ఎస్‌ది అన్నారు. హరీష్ రావు స్పందిస్తూ.. మద్యంపై రూ.7వేల ఆదాయం పెరుగుతుందని బడ్జెట్‌లో తెలిపారని ఎలా పెరుగుతుందో చెప్పాలని కోరారు.

మద్యం ధరలు పెంచి ఈ ఆదాయం సమకూర్చుకుంటారా అని ప్రశ్నించారు. ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచడం అంటే మద్యాన్ని ప్రోత్సహించడమే కదా అన్నారు. భట్టి రిప్లై ఇస్తూ.. ‘టానిక్’ లాంటి మద్యం షాపులు పెట్టి ప్రభుత్వ ఆదాయాన్ని రాకుండా కొద్ది మంది కుటుంబాల చేతుల్లో బీఆర్ఎస్ నాయకులు పెట్టారన్నారు. ఆ ఆదాయం మొత్తం రాష్ట్రానికి తిరిగి వచ్చేలా చేస్తామని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రభుత్వంలో మీరే ఉన్నారని కాంగ్రెస్ సర్కారు చర్యలు తీసుకోవాలని హరీష్ రావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మద్యంపై ఆక్షన్ ఈ ఆర్థిక సంవత్సరానికి పెట్టాల్సి ఉండగా గతేడాదే ఎలక్షన్ ముందు పెట్టారని భట్టి గత ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..