TG Assembly: బడా కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లిస్తరా.. సర్పంచ్‌ల సంగతేంది: అసెంబ్లీలో హరీశ్‌రావు ఫైర్
రాష్ట్ర ప్రభుత్వం కేవలం బడా కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లిస్తోందని.. భార్య మెడలో ఉన్న పుస్తెను అమ్మి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్‌ల సంగతేందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) ఫైర్ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం కేవలం బడా కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లిస్తోందని.. భార్య మెడలో ఉన్న పుస్తెను అమ్మి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్‌ల సంగతేందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన అసెంబ్లీ (Assembly)లో మాట్లాడుతూ.. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు. జీపీ జనరల్ ఫండ్స్ (GP General Funds)కు సంబంధించి ఫైనాన్స్ శాఖ నుంచి క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో పంచాయతీల్లో చెక్కులు పాస్ అవ్వక సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.
ఏడాది కాలంగా సర్పంచ్‌లకు చెల్లించాల్సిన రూ.691 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. నిధులు విడుదల చేయాలని కోరుతూ.. ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తే సర్పంచ్‌లను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారని తెలిపారు. ఒక్క నవంబర్ నెలలోనే బడా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రూ.1200 కోట్ల బిల్లులు చెల్లిచిందని.. చిన్న కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు మాత్రం నయా పైసా చెల్లించపోవడం దారుణమని అన్నారు. పంచాయతీ ఎన్నికల లోపు పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని.. ఎప్పటిలోగా క్లియర్ చేస్తారో సర్కార్ సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.