TG Assembly: అసెంబ్లీని ముట్టడించిన బీఆర్ఎస్వీ నేతలు.. పలువురు అరెస్ట్

రాష్ట్రంలో విద్యా రంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఇవాళ బీఆర్ఎస్వీ నాయకులు తెలంగాణ అసెంబ్లీని ముట్టడించారు.

Update: 2025-03-17 07:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో విద్యా రంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఇవాళ బీఆర్ఎస్వీ నాయకులు తెలంగాణ అసెంబ్లీని ముట్టడించారు. ఈ నేపథ్యంలో వారంతా అసెంబ్లీ లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఓయూలో ధర్నాలు, నిరసనలు నిషేధిస్తూ.. వీసీ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు విద్యా శాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇక గురుకులాల్లో మరణించిన విద్యార్థులకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని అన్నారు. 

Tags:    

Similar News