ఎస్‌ఆర్ నగర్ పీఎస్ వద్ద ఉద్రిక్తత.. పంజాగుట్ట పీఎస్‌లో YS Sharmila పై కేసు

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలిపై నిన్న జరగగా మంగళవారం ధ్వంసమైన కారులోనే ప్రగతి భవన్ కు వెళ్లేందుకు యత్నించారు.

Update: 2022-11-29 09:05 GMT

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కారు, కారవ్యాన్ పై నిన్న టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయగా అందుకు నిరసనగా మంగళవారం ధ్వంసమైన కారులోనే ప్రగతి భవన్ కు వెళ్లేందుకు ఆమె యత్నించారు. దీంతో పోలీసులు ఆమెను సోమాజిగూడ వద్ద అడ్డుకున్నారు. షర్మిల కారు లోపల డోర్ లాక్ చేసుకోవడంతో కాసేపు వేచి చూసిన అధికారులు ఎంతకీ దిగకపోవడంతో కారును ట్రాఫిక్ వాహనంతో ఎస్‌ఆర్ నగర్ పీఎస్‌కు తరలించారు. ఆ సమయంలో షర్మిల కారులోనే ఉన్నారు. అనంతరం షర్మిలను ఎస్‌ఆర్ నగర్ పీఎస్‌కు పోలీసులు తరలించారు. దీంతో వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున్న ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చారు. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మహిళా నేతకు రక్షణ కల్పించడంలో తెలంగాణ పోలీసులు విఫలమయ్యారని కార్యకర్తలు ఆరోపించారు. ప్రజల కోసం కష్టపడుతున్న తమ నాయకురాలిని అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో షర్మిలపై కేసు నమోదైంది. మూడు సెక్షన్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్గించినందుకు పోలీసులు కేసు నమోదు చేసారు. 

ఎస్‌ఆర్ నగర్ పీఎస్ వద్ద ఉద్రిక్తత

Tags:    

Similar News