MLC బల్మూరి వెంకట్‌ను అడ్డుకున్న నిరుద్యోగులు.. గాంధీ హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..!

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు జీవో

Update: 2024-06-30 17:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు జీవో నెం 46 రద్దు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మోతీలాల్ నాయక్‌ అనే యువకుడు అమరణ నిరహార దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మోతిలాల్ నాయక్‌ను పరామర్శించేందుకు ఆదివారం రాత్రి ఎన్ఎస్‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రియాజ్, మానవతా రాయ్ ఇతర కాంగ్రెస్ నేతలు గాంధీ ఆసుపత్రికి వెళ్లారు.

ఈ క్రమంలో పలు విద్యార్థి సంఘ నేతలు, ఓయూ విద్యార్థులు బల్మూరి వెంకట్‌తో పాటు కాంగ్రెస్ నేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. జాబ్ క్యాలెండర్ విడుదల, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై వారిని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలకు, నిరుద్యోగులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం నిరుద్యోగులు గాంధీ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Similar News