అధికారులకు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా కీలక ఆదేశం

అన్ని ఆసుపత్రులలో సీజనల్ వ్యాధుల మందుల కొరత రావొద్దని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు.

Update: 2024-07-02 15:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అన్ని ఆసుపత్రులలో సీజనల్ వ్యాధుల మందుల కొరత రావొద్దని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు స్టాక్ ఫిల్ చేసుకోవాలన్నారు. ప్రతి ఆసుపత్రి అధికారి వెంటనే ఇండింట్ పెట్టి మందులు తెప్పించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రి, టీజీ ఎంఎస్ ఐడీసీ మధ్య కో ఆర్డినేషన్ అవసరం అన్నారు. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్, ఏరియా, జిల్లా ఆసుపత్రులు ఎంతెంత దూరంలో ఉన్నాయో..? అనేది నివేదిక తయారు చేయాలన్నారు. ప్రజల అవసరాన్ని బట్టి త్వరలో ఆసుపత్రులను సమీపంలోకి చేర్చేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుందని వెల్లడించారు. ఈ సమీక్ష సమావేశంలో టీజీఎంఎస్ ఐడీసీ ఎండీ హేమంత్ సహదేవరావు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ విశాలాక్షి, కౌటిల్య, చీఫ్ ఇంజనీర్ దేవేందర్ కుమార్‌లు పాల్గొన్నారు.

Similar News