TG: తెలంగాణలో పది మంది ఐపీఎస్‌ల బదిలీలు
నూతన సంవత్సర వేడుకల వేళ తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: నూతన సంవత్సర వేడుకల వేళ తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Santhi Kumari) ఉత్తర్వులు జారీ చేశారు. ఊట్నూరు అదనపు ఎస్పీగా కాజల్, దేవరకొండ అదనపు ఎస్పీగా మౌనిక, భువనగిరి అదనపు ఎస్పీగా రాహుల్ రెడ్డి, అసిఫాబాద్ అదనపు ఎస్పీగా చిత్తరంజన్, కామారెడ్డి అదనపు ఎస్పీగా బొక్కా చైతన్య, జనగామా అదనపు ఎస్పీగా చేతన్ నితిన్, భద్రాచలం అదనపు ఎస్పీగా విక్రాంత్ కుమార్, కరీంనగర్ రూరల్ అదనపు ఎస్పీగా శుభం కుమార్, నిర్మల్ అదనపు ఎస్పీగా రాజేశ్ మీనా, డీజీపీ కార్యాలయానికి అంకిత్ కుమార్‌ను అటాక్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.