యావత్ దేశంలోనే రుణమాఫీ విషయంలో తెలంగాణ రికార్డ్: చనగాని దయాకర్

బీఆర్ఎస్ నేతలకు మొఖాలు ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం అవుతుందా..? అని టీపీసీసీ స్పోక్స్ పర్సన్ చనగాని దయాకర్ విమర్శించారు.

Update: 2024-07-16 14:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నేతలకు మొఖాలు ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం అవుతుందా..? అని టీపీసీసీ స్పోక్స్ పర్సన్ చనగాని దయాకర్ విమర్శించారు. రుణమాఫీపై ఇప్పుడు ఏం మాట్లాడతారు..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అదృష్టవంతులని పేర్కొన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రైతన్న సంక్షేమం కోసం రేవంత్ సర్కార్ కృషి చేస్తుందన్నారు. రైతు బిడ్డ రైతుల కష్టాలు చూసిన నేతగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం హర్షణీయమన్నారు.

వరంగల్ రైతు డిక్లరేషన్‌తో మాట ఇస్తే ఇప్పుడు ఆ హామీ నెరవేరబోతున్నదన్నారు. రూ.31 వేల కోట్లతో 47 లక్షల మంది రైతులకు మేలు జరగడం దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. పదిఏళ్ళుగా కేసీఆర్ లక్ష రుణమాఫీని కూడా సంపూర్ణంగా చేయలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి కేవలం 7 నెలలైనా, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటీ నెరవేర్చుతామన్నారు. రేషన్ కార్డ్ ఉంటేనే రైతు రుణమాఫీ అనేది తప్పడు సమాచారం అన్నారు.


Similar News