జపాన్ పర్యటనకు తెలంగాణ విద్యార్థులు
రాష్ట్రానికి చెందిన నలుగురు విద్యార్థులు జపాన్‌కు వెళ్లనున్నారు. ఈ ఏడాది నవంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు వారం పాటు నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి చెందిన నలుగురు విద్యార్థులు జపాన్‌కు వెళ్లనున్నారు. ఈ ఏడాది నవంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు వారం పాటు నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జపాన్ పర్యటనకు నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇదిలా ఉండగా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ ‘జపాన్ సైన్స్ హైస్కూల్ ప్రోగ్రామ్(సకుర సైన్స్ ప్రోగ్రామ్)’ను నిర్వహించింది. ఇందులో తెలంగాణకు చెందిన నలుగురు విద్యార్థులు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపారు.
చేవెళ్ల మోడల్ స్కూల్‌లో ఇంటర్ సెకండియర్ చదువుతున్న సరబ్ జిత్, శంకరపట్నం మోడల్ స్కూల్ విద్యార్థి నబా మహమ్మది, మంచిర్యాల కేజీబీవీలో సెకండియర్ చదువుతున్న విద్యాసింగ్, కొత్తకోటలో ఫస్టియర్ చదువుతున్న భాస్కర్ ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యారు. జపాన్‌కు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జపాన్‌కు చెందిన మోస్ట్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ టెక్నాలజీతో పాటు పలువురు సైంటిస్టులను వారు కలుసుకోనున్నారు. ఇదిలా ఉండగా దీనికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల విద్య డైరెక్డర్ నర్సింహారెడ్డి అభినందించారు. వారికి సన్మానం చేశారు.