విజిటర్లకు ‘‘నో వాటర్’’.. నూతన సచివాలయంలో సందర్శకులకు తప్పని తిప్పలు!

అన్ని హంగులతో సెక్రటేరియట్‌ను నిర్మించామని ఓ వైపు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. సచివాలయానికి వచ్చే సందర్శుకులు

Update: 2023-05-17 02:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అన్ని హంగులతో సెక్రటేరియట్‌ను నిర్మించామని ఓ వైపు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. సచివాలయానికి వచ్చే సందర్శుకులు మాత్రం తాగడానికి నీరు కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయ సందర్శనకు వచ్చే వారి కోసం పాస్‌లు ఇచ్చేందుకు ప్రత్యేక కౌంటర్లు, హాల్‌ను ఏర్పాటు చేశారు. ఎంట్రీ పాస్‌లు అప్రూవల్ అయ్యే వరకు వెయిటింగ్ హాల్‌లో ఉండాల్సి వస్తున్నది.

అయితే అక్కడ కూర్చోవడానికి సౌకర్యాలు ఉన్నప్పటికీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయలేదు. ఎండాకాలం కావడంతో విజిటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పక్కనే ఉన్న క్యాంటీన్‌లో నీళ్లు కొనుక్కొని తాగుతునారు. మరోవైపు సెక్యూరిటీ, రిసెప్షన్ కౌంటర్ల స్టాఫ్ కూడా సొంతంగానే నీళ్లు తెచ్చుకుంటున్నారు. సెక్రటేరియట్‌కు ప్రతి రోజు సుమారు 400 మంది విజిటర్లు వస్తుండగా, నీటి సౌకర్యం కల్పించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News