Telangana Police: అలాంటి వారికి జైలు గోడలే దిక్కు.. తెలంగాణ పోలీస్ ట్వీట్
తెలంగాణ పోలీసులు సైబర్ నేరాలు, మత్తు పదార్ధాలకు అలవాటు పడటం, విక్రయించం లాంటి పలు నేరాలపై అవగాహాన కల్పిస్తూ.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పోలీసులు సైబర్ నేరాలు, మత్తు పదార్ధాలకు అలవాటు పడటం, విక్రయించం లాంటి పలు నేరాలపై అవగాహాన కల్పిస్తూ.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఈ నేపధ్యంలోనే నేరం చేయడమే కాదు. నేరగాళ్లకు సహరించడం కూడా నేరం కిందికే వస్తుంది అని ట్వీట్ చేశారు. ఇందులో రూ.8 కోట్ల డ్రగ్స్ విక్రయించబోయి పట్టుబడ్డ తాపీమేస్త్రీ, అతని వద్ద నిల్వ చేసిన డ్రగ్ డీలర్ అరెస్ట్ అవ్వడంతో అమ్మేందుకు ప్రణాళిక, పోలీసులకు పట్టుబడ్డ నిందితుడు అని ఓ దిన పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్టు చేస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేరాలకు పాల్పడటమే కాదు నేరగాళ్లకు సహకరించడం కూడా నేరమే అవుతుందని చెప్పారు. డబ్బుకి ఆశపడి డ్రగ్స్, గంజాయి పెడ్లర్లకు సాయపడటం, వాటిని దాచడం, మత్తు పదార్థాల సేవనం చేస్తే కఠిన శిక్షలు స్వాగతం పలికుతాయని చెప్పారు. అలాంటి వారికి జైలు గోడలే దిక్కవుతాయని, తస్మాత్ జాగ్రత్త అని ఎక్స్ వేదికగా హెచ్చరించారు.