తెలంగాణ ఉద్యమ కళాకారుడు వేముల నరేష్ కన్నుమూత

తెలంగాణ ఉద్యమ కళాకారుడు, అరుణోదయ సంస్కృతిక సంస్థ మాజీ నాయకుడు వేముల నరేష్ మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతోన్న

Update: 2024-07-17 04:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యమ కళాకారుడు, అరుణోదయ సంస్కృతిక సంస్థ మాజీ నాయకుడు వేముల నరేష్ మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్నుమూశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్ని ఎన్నో వేదికలపై తన పాటలతో ప్రజలను చైతన్య పరిచిన గొంతు శాశ్వతంగా మూగబోయింది. దీంతో తోటి కళాకారులు, ఆయన అభిమానులు నరేష్ మృతి పట్ల నివాళులు అర్పిస్తున్నారు. కాగా, 2003-04 ప్రాంతంలో నల్గొండ జిల్లా దేవరకొండలోని రాచకొండ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జరిగిన పాదయాత్రతో తొలిసారి నరేష్ తెరపైకి వచ్చారు. ఆ పాదయాత్రలో ఆయనది ప్రముఖ పాత్ర. నరేష్ పాటలు అక్కడి ప్రజలను బాగా చైతన్య పరిచాయి. పాటలు పాడడంలో నరేష్‌ది ఒక ప్రత్యేకమైన శైలీ.

స్టేజి మొత్తాన్ని కూడా ఒక్కడే తన పాటలతో నడిపించిడం అతడి స్టైల్. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడ ప్రోగ్రాం జరిగిన ఆయన పాల్గొని తన గొంతు వినిపించేవారు. ధర్నా అయినా సభ అయినా రాస్తారోకోలు అయిన రైలు రోకో అయినా నరేష్ ముందు వరుసలో నిలబడే తన పాటలతో ఉర్రూతలూగించేంది. ఎంతోమంది కళాకారులను ఉద్యమంలోకి తీసుకొచ్చిన నరేష్ మరణం కళా రంగానికి తీరని లోటని ఈ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటున్నారు.


Similar News