జూ.ఎన్టీఆర్‌కి బెస్ట్ విషెస్ తెలిపిన తెలంగాణ మంత్రి.. కారణం ఇదే!

గ్లోబల్ స్టార్ జూ.ఎన్‌టీఆర్‌, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం 'దేవర'. ఈ నెల 27న మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Update: 2024-09-24 06:25 GMT

దిశ,వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ జూ.ఎన్‌టీఆర్‌, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం 'దేవర'. ఈ నెల 27న మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో దేవర చిత్రం టికెట్ల ధరలు పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మిడ్ నైట్ షోకు 29 థియేటర్లలో అనుమతులు ఇచ్చింది. సినిమా విడుదలైన తొలిరోజు మొత్తం ఆరు షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్‌పై రూ.100 పెంచుకునేందుకు ఛాన్స్ ఇచ్చారు.

సింగిల్ స్రీన్‌లలో టికెట్‌పై రూ.25, మల్టీప్లెక్స్ లలో టికెట్ పై రూ.50 పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో దేవర టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడం పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా రిప్లై ఇచ్చారు. దేవర రిలీజ్ సందర్భంగా తారక్‌కి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ తెలుగు చిత్ర పరిశ్రమకు అండగా నిలుస్తూనే ఉంటుంది అని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.


Similar News