నాలుగైదు రోజులుగా వర్షాలు.. వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన

రాష్ట్రంలో శనివారం, ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది.

Update: 2024-12-27 13:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో శనివారం, ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్న, మొన్న చిరు జల్లులు కురువగా తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కాగా, రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో రాబోయే ఐదు రోజుల వరకు అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని, అదే సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సీయస్ నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుండి ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈనెల 28వ తేదీ నుండి వచ్చే నెల జనవరి 2వ తేదీ వరకు కూడా దాదాపుగా రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.

Tags:    

Similar News