తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తెలంగాణ వైద్య మండలి ఆకస్మిక తనిఖీలు చేపట్టింది.

Update: 2024-09-15 16:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తెలంగాణ వైద్య మండలి ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. చైర్మన్ డాక్టర్ కే. మహేష్ కుమార్, వైస్ చైర్మన్ డా. జీ. శ్రీనివాస్ ల ఆధ్వర్యంలోని బృందాలు పలు మందుల దుకాణాలపై రెయిడ్స్ చేశాయి. క్లినిక్ లు, హాస్పిటళ్లలో తనిఖీలు నిర్వహించి దాదాపు 20 మంది నకిలీ వైద్యులను పట్టుకున్నారు. దీంతో పాటు చట్ట విరుద్ధంగా వినియోగిస్తున్న పలు రకాల ఆంటిబయోటిక్స్, స్టేరాయిడ్, నార్కోటిక్ ఇంజక్షన్స్ స్వాదీనం చేసుకొని తగు ఆధారాలు సేకరించారు. నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం 34, 54 ప్రకారం కేసులు ఫైల్ చేయనున్నట్లు చైర్మన్ వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 300 లకు పైగా ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామన్నారు అధికారులు.


Similar News