CM రేవంత్ రెడ్డి ఆలోచన చాలా గొప్పది.. ఆనంద్ మహీంద్ర ప్రశంస

తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ(Telangana Young India Skill University Board) బోర్డు సభ్యులతో సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమావేశమయ్యారు.

Update: 2024-09-19 15:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ(Telangana Young India Skill University Board) బోర్డు సభ్యులతో సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రులు శ్రీధర్ బాబు, వర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) మాట్లాడుతూ.. యువతలో నైపుణ్యాలు పెంపొందించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చాలా గొప్పదని అన్నారు. రేవంత్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడు అంటూ ప్రశంసించారు.

అందుకే ఆయన వర్సిటీకి చైర్మన్‌గా ఉండాలని కోరగానే ఒప్పుకున్నట్లు తెలిపారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరపున రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ఇక, యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని సీఎం కోరారు. యూనివర్సిటీ నిర్వహణకు ఎవరికి తోచింది వారు వివిధ రూపాలలో సహకారం అందించాలని కోరారు. దేశానికే ఆదర్శంగా స్కిల్ యూనివర్సిటీని తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ బాధ్యతను వర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు తెలిపారు.


Similar News