'నర్సుల నిర్లక్ష్యం శిశువు మృతి' వార్త కథనంపై స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహ

హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రిలో నర్సులు నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందినట్లు వచ్చిన వార్తలపై ఆరోగ్య మంత్రి మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Raja Narasimha) స్పందించారు.

Update: 2024-09-19 15:37 GMT

దిశ, వెబ్ డెస్క్: హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రిలో నర్సులు నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందినట్లు వచ్చిన వార్తలపై ఆరోగ్య మంత్రి మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Raja Narasimha) స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరారు. దీంతో తెలంగాణ వైద్య విధాన పరిషత్ (Telangana Vaidya Vidhana Parishad) కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తక్షణమే హుజూర్ నగర్ ఆస్పత్రి సూపరింటేండెంట్‌తో విచారణ జరిపి నివేదిక సమర్పించారు. ఆ నివేదికలో సదరు పత్రికల్లో వచ్చిన అంశాలు, ఆరోపణలు నిరాధారం అని తేల్చారు. దీంతో నిరాధారమైన వార్తను నిర్ధారించుకోకుండా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి రాజకీయాలు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా మంత్రి మండిపడ్డారు. ప్రజలకు ప్రభుత్వ సంస్థల పట్ల నమ్మకం పోయేలా కొంతమంది వ్యవహరిస్తున్నారని.. ప్రజాస్వామ్యంలో హుందాగా వ్యవహరించాలని, ప్రజలకు ప్రభుత్వ సంస్థలపై గౌరవం పెరిగేలా మాట్లాడాలని, నిర్మాణాత్మక విమర్శలు చేస్తే వెంటనే స్పందిస్తామని.. ట్విట్టర్ వేదికగా మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పుకొచ్చారు.


Similar News