ఏపీకి అలాట్ అయిన తెలంగాణ ఐఏఎస్‌లు రిలీవ్.. వారి స్థానాల్లో సీనియర్లకు అదనపు బాధ్యతలు

తెలంగాణ(Telangana) నుంచి రిలీవ్ అయిన ఐఏఎస్(IAS) అధికారుల స్థానాల్లో ప్రభుత్వం ఇన్‌చార్జులను నియమించింది.

Update: 2024-10-16 15:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana) నుంచి రిలీవ్ అయిన ఐఏఎస్(IAS) అధికారుల స్థానాల్లో ప్రభుత్వం ఇన్‌చార్జులను నియమించింది. పలువురు సీనియర్ ఐఏఎస్‌ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Shanti Kumari) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవోగా ఆర్వీ కర్ణన్, ఆయుష్ డైరెక్టర్‌గా క్రిస్టినా, మహిళా సంక్షేమ శాఖ కార్యదర్శిగా టీకే శ్రీదేవీ, ఎనర్జీ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియా, టూరిజం అండ్ కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

కాగా, డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం ఐఏఎస్‌ అధికారులు వాణి ప్రసాద్‌, వాకాటి కరుణ, రొనాల్డ్‌ రోస్‌, ఆమ్రపాలి, సృజన, శివశంకర్‌, హరికిరణ్‌లు ఏపీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. అంతకుముందు క్యాట్ తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టు ఆశ్రయించినా వారికి ఊరట దక్కలేదు. రిలీవ్‌ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ఐఏఎస్‌ల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ముందు ఎక్కడివాళ్లు అక్కడ రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.


Similar News