Minister KTR: తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్..

తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం టాప్ లో ఉందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు.

Update: 2023-07-26 14:17 GMT

దిశ, వెబ్ డెస్క్: తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం టాప్ లో ఉందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన వార్తను ట్విట్టర్ లో ఆయన పోస్టు చేశారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన నివేదికలో ప్రస్తుతం ధరల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.రూ.3,08,732 తలసరి ఆదాయంతో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. గత ఏడాది రూ.2,65,942 ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం ఈసారి బాగా పెరిగింది. ఇక తలసరి ఆదాయం విభాగంతో తెలంగాణ తర్వాత రూ.2,65,623తో కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..