మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 17 పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 17 పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ వార్ నడుస్తుండగా గవర్నర్ చేసిన కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతున్నాయి. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా చేసుకోవాలని గవర్నర్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్ర ప్రజలపై రజాకార్ల అరాచకాలను మర్చిపోలేమని అన్నారు. నిజాం నుండి విమోచనం పొందిన రోజు సెప్టెంబర్ 17ను అని అన్నారు. బుధవారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ లిబరేషన్ మూవ్‌మెంట్ - ఫోటో & ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి మాట్లాడారు. గవర్నర్ రజాకార్లు, నిజాం చెర నుండి బయటకు పడేందుకు అనేక మంది ప్రాణత్యాగం చేశారని ఎన్నో గాథలు వాటిని స్పష్టం చేస్తున్నాయన్నారు. ఎందరో చెమట, రక్తాలను చిందించి తెలంగాణ విమోచనం వైపు నడిపించారని అన్నారు. సెప్టెంబర్ 17 రాజాకార్ల అరాచకాల నుండి స్వేచ్ఛను పొందిన రోజు అని.. ఈ రోజును ప్రజలు లిబరేషన్ డే గా సెలబ్రేట్ చేసుకోవాలని అన్నారు. విమోచనం కోసం హైదరాబాద్ స్టేట్ ప్రజలు చేసిన పోరాటాలను తెలుసుకున్నప్పుడు తాను నిద్ర లేని రాత్రి గడిపానన్నారు. పరకాల గ్రామంలో 35 మందిని వరుసలో నిల్చోబెట్టి కాల్చి చంపారు, బైరాన్ పల్లిలో 90 మందిని చంపేశారు వారి రక్తం ఈ నేలపై చిందించబడిందని అన్నారు. రజాకార్ల అరాచకాలను ఎలా మర్చిపోగలమని అన్నారు. తెలంగాణ ప్రజలు చరిత్ర తెలుసుకోవాలని అన్నారు.
Also Read : స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల నుంచి యువత స్ఫూర్తి పొందాలి: గవర్నర్