స్కూళ్లలో డ్రగ్స్ అరికట్టేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

రాష్టంలోని పాఠశాలల్లో మాదకద్రవ్యాల విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం పాఠశాలలో ప్రహరీ కమిటీలు

Update: 2024-07-13 17:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్టంలోని పాఠశాలల్లో మాదకద్రవ్యాల విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం పాఠశాలలో ప్రహరీ కమిటీలు వేసి మాదక ద్రవ్యాల విక్రయాలకు చెక్ పెట్టనున్నారు. పాఠశాలలు, విద్య, శిశు సంరక్షణ సంస్థల పరిసర ప్రాంతాలలో మాదకద్రవ్యాల విక్రయాలను ఆపడానికి ఈ ప్రహరీ కమిటీలు పని చేయనున్నాయి. అన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. పిల్లలను మాదకద్రవ్యాల దుర్వినియోగం నుండి దూరం చేయడానికి ప్రహరీ క్లబ్‌లు నిర్మించనున్నారు. విద్యార్థులు ఉండే పరిసర ప్రాంతాలలో మాదకద్రవ్యాల విక్రయాలను ఆపడానికి ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. పిల్లలు మత్తు పదార్థాలుగా ఉపయోగించే ఔషధ మందులు, పదార్థాలు ఇతర రకాల వస్తువులు చేరకుండా నిరోధించడానికి ఈ క్లబ్‌లు ఏర్పాటు చేయనుంది.


Similar News