T Congress: మీ గుట్టు బయటపడుతుందనే ప్రజా ప్రభుత్వంపై విమర్శలు.. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఫైర్

బీఆర్ఎస్ పై టీ కాంగ్రెస్ ఫైర్ అయింది.

Update: 2024-09-26 06:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అవినీతిని ఎంత అందంగా చేయాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉదాహరణగా చూపిస్తే సరిపోతుందని టీ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. గత ప్రభుత్వం నిర్మించిన సచివాలయ నిర్మాణ వ్యయాన్ని అమాంతం పెంచి నిర్మించిన తీరుపై గురువారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ స్పందించింది. అవినీతి పరులకే ఎన్ని రకాలుగా అవినీతి చేయవచ్చో తెలుసని అందుకే బీఆర్ఎస్ అవినీతి నాయకులు వారి అవినీతి అనుభవంతో అసంబద్ధ ఆరోపణలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతూ పబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తింది. వారి అవినీతి బయటపడుతుందని ముందే గ్రహించి, ప్రజా ప్రభుత్వంపై అసంబద్ధ విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టింది. సచివాలయం నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 617 కోట్ల అంచనా వేసి దానిని రూ. 1,140 కోట్లకు అంచనాలు పెంచిందని ధ్వజమెత్తింది. ఐటీ పరికరాల కొనుగోలుకు రూ.181 కోట్ల అంచనా వేస్తే దానిని రూ. 361 కోట్లకు పెంచి ఖర్చు చేశారని అంచనాల పెంపు బాగోతం అంతా విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చబోతున్నదని పేర్కొంది. 


Similar News