Congress : ‘కాగ్’ చెప్పిన నగ్న సత్యం ఇదే.. గత పాలనపై టీ కాంగ్రెస్ సెటైర్లు

రాష్ట్ర ఖజానాకు లిక్కర్ ద్వారా ఆదాయం ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. ఈ మేరకు తెలంగాణ లిక్కర్ ఆదాయంపై ఇటీవల కాగ్ నివేదిక ఇచ్చింది.

Update: 2024-08-09 05:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ఖజానాకు లిక్కర్ ద్వారా ఆదాయం ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. ఈ మేరకు తెలంగాణ లిక్కర్ ఆదాయంపై ఇటీవల కాగ్ నివేదిక ఇచ్చింది. దీనిపై తాజాగా టీ కాంగ్రెస్ స్పందిస్తూ గత బీఆర్ఎస్ పాలనపై సెటైరికల్ ట్వీట్ వేసింది. బీఆర్ఎస్ పాలనలో లిక్కర్ స్కామ్‌లే కాదు, లిక్కర్ ఆదాయం సైతం ఆకాశమే హద్దుగా దూసుకెళ్లాయట అని వెల్లడించింది. ఇది తమ లెక్క కాదని, ‘కాగ్’ నివేదిక చెప్పిన నగ్న సత్యం మని పేర్కొన్నది.

రాష్ట్ర జీడీపీ కంటే కేసీఆర్ రెండో దఫా పాలనలో లిక్కర్ ఆదాయం గ్రోతే ఎక్కువ అని కాగ్ తేల్చిందని పేర్కొంది. 2018 - 19 నుంచి 2022 - 23 మధ్య జీఎస్‌డీపీ గ్రోత్ 15.09 శాతం ఉంటే.. 2018 - 19 : 16.45 శాతం, 2019 - 20 : 17.74 శాతం, 2020 - 21 : 21.56 శాతం, 2021 - 22 : 19.15 శాతం, 2022 - 23: 21.56 శాతం లిక్కర్ ఆదాయం గ్రోత్ ఉన్నదని వెల్లడించింది. ఈ క్రమంలోనే ఎంత మత్తు పాలన చేశావు దొరా అంటూ సెటైర్లు వేసింది.

Tags:    

Similar News