రాహుల్ గాంధీ పప్పు కాదు.. నిప్పు: రేవంత్ రెడ్డి

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-03-26 12:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని బీజేపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. బీజేపీ పాలన బ్రిటీషర్లను తలపిస్తోందని అన్నారు. బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. ముందుగా బ్రిటీషర్లు వాళ్లు కూడా గుజరాత్‌లోని సూరత్‌లోనే ఎంట్రీ ఇచ్చారు.. అక్కడుంచి దేశాన్ని క్రమంగా ఆక్రమించుకున్నారని గుర్తుచేశారు. గతంలో వాళ్ళని తరిమికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నదని, ఇప్పుడు బీజేపీని తరిమికొట్టేది కూడా తామే అని అన్నారు. కాంగ్రెస్ వేసిన పునాదులతోనే దేశం అభివృద్ధి జరిగిందని గుర్తుచేశారు.

కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు బీజీపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. తెలివి లేక గుండు, అరగుండు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ దేశ సంపదను కొల్లకొడితే కాంగ్రెస్ అడ్డుకున్నదని అన్నారు. బీజీపీ పాలనలో కూడా దేశాన్ని కొల్ల కొట్టడానికి అదానీ కంపెనీ వస్తోందిని.. ఇప్పటికే వేల కోట్లు వాళ్లకు కేంద్రం దోచిపెడుతోందని.. తక్షణమే పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. దేశాన్ని కాపాడుకోవడం కోసం యువత సిద్ధం కావాలని సూచించారు. డబుల్ ఇంజిన్ అంటే ప్రధాని, అదానీ.. ఇప్పుడు అదానీ ఇంజిన్ దెబ్బతిన్నది.. అందుకే రిపైర్ చేసేందుకు మోడీ ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ పప్పు కాదని, నిప్పు అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News