తెలంగాణ భవన్‌కు To-let బోర్డ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న పోస్ట్
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దిశ, వెబ్‌డెస్క్ : అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్‌కు టు లెట్ బోర్డు ఉన్న ఫొటోను తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) X అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ‘‘For Sale also Available’’ (అమ్మకానికి అందుబాటులో ఉంది) అంటూ క్యాప్షన్ పెట్టి మరి షేర్ చేసింది. ‘‘అమెరికాకు (మనవడు దగ్గరకి) వెళ్లిపోయిన తాత..’’ ‘‘లిక్కర్ స్కామ్ కేసులో జైలుకెళ్లి వచచిన చెల్లి’’ ‘‘ఫార్ములా ఈ రేసు కేసులో జైలుకు వెళ్లనున్న అన్న’’ అంటూ వ్యంగ్యస్త్రాలు వేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.