తెలంగాణపై నాకు పూర్తి అవగాహణ ఉంది: మున్షీ
లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఉత్సాహంతో తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుపు సాధిస్తామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ ఈ మూడు పార్టీలు పరోక్షంగా కలిసి పనిచేస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం కోరుకోవడం మంచి పరిణామమని అన్నారు. ఈసారి సోనియా ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇంకా తెలియదని, అయితే గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా తెలంగాణ నుంచి పోటీ చేస్తే అది పార్టీకి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అన్ని విషయాలపైనా తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. జనవరి మొదటి వారంలో తాను తెలంగాణకు వెళతానన్నారు. ఎమ్మెల్యేలుగా ఓడిన సీనియర్ల సేవలను కూడా పార్టీ, ప్రభుత్వం ఉపయోగించుకునే విషయంపై పార్టీలో చర్చిస్తానన్నారు.