Congress : బిడ్డా కేటీఆర్.. నీతో రికార్డు డ్యాన్సులు చేయిస్తరు..! టీ కాంగ్రెస్ ఫైర్ ట్వీట్
మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఫైర్ అవుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఫైర్ అవుతోంది. మనిషికి ఒక బస్సు పెట్టుకోండి.. కుటుంబమంతా పోయి కుట్లు, అల్లికలు అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ ఏమి చేస్తారు చేయండి మేము ఎందుకు వద్దని అంటాం.. అని మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా తెలంగాణ భవన్లో వ్యాఖ్యనించారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్వీట్టర్ వేదికగా కేటీఆర్‌ను తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అహంకారం, బలుపు, కుంచిత మనస్తత్వం, మహిళల పట్ల నీచమైన ఆలోచన, ప్రజల పట్ల చులకన కేటీఆర్ కు జన్మతః వచ్చిన స్వభావాలు.. అని విమర్శించింది.
మహిళలను ఆర్టీసీ బస్సుల్లో రికార్డు డాన్స్ చేయమని అంటావా.. నీ అయ్య గిట్ల చిల్లర మాటలు మాట్లాడితేనే, ఆ కండ కావరన్ని తగ్గించి ఫామ్ హౌస్‌లో పండబెట్టిల్లు. నువ్వు కూడా నీ అయ్యలాగే బలుపు మాటలు మాట్లాడుతున్నావ్.. అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బిడ్డా కేటీఆర్.. నిన్ను తెలంగాణ ప్రజలు క్షమించరు.. ఇంకోసారి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే, తెలంగాణ ఆడ బిడ్డలు చూస్తూ ఊరుకోరు, నీ చేతికి గాజులు వేసి నీతో రికార్డు డ్యాన్సులు చేయిస్తరు తస్మాత్ జాగ్రత్త.. అంటూ కేటీఆర్ మాట్లాడిన వీడియో ఎక్స్‌లో పోస్ట్ పెట్టి హెచ్చరించింది.