టీ-కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మీటింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. హాజరుకానున్న CM రేవంత్

కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు వేగవంతం చేసింది. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ముగియగా, పేర్ల జాబితాను ఎంపిక చేసేందుకు రెడీ అయింది.

Update: 2024-02-04 15:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు వేగవంతం చేసింది. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ముగియగా, పేర్ల జాబితాను ఎంపిక చేసేందుకు రెడీ అయింది. దీనిలో భాగంగానే మంగళవారం ప్రదేశ్ ఎన్నికల కమిటీ మీటింగ్ జరగనున్నది. సీఎం అధ్యక్షతన గాంధీభవన్‌లో ఈ మీటింగ్ జరగనున్నది. ఈ సమీక్షకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరీ, సభ్యులు జిగ్నేశ్ మేవాని, విశ్వజిత్ కధమ్‌లు హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధుల ఎంపిక పై చర్చించనున్నారు. గెలుపు గుర్రాలను సెలక్ట్ చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరగనున్నది. పార్లమెంట్ సెగ్మెంట్‌ల వారీగా అమలు చేయాల్సిన వ్యూహాలు, గెలిచేందుకు పాటించాల్సిన ప్రణాళికపై ఈ సమీక్షలో చర్చించనున్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించాల్సిన పేర్లను డిస్కషన్స్ జరగనున్నాయి.

Tags:    

Similar News