Telangana Congress: గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల ధర్నా

రాహుల్ గాంధీపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ.. గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల ధర్నా నిర్వహించారు.

Update: 2024-09-18 08:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాహుల్ గాంధీపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ.. గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, వీహెచ్, కట్టా సాయి కుమార్ సహా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ నాయకుడు తన్వీన్దర్ సింగ్ ఆరా, రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐసీసీ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కాంగ్రెస్ నాయకులు రోడ్లపైకి వచ్చి ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు.

బీజేపీ నేతల వైకరికి నిరసన తెలుపుతూ.. వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ నేపధ్యంలోనే గాంధీభవన్ లో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ నేతల ఫోటోలతో ధర్నా నిర్వహించారు. బీజేపీ నాయకుల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన తెలియజేశారు. అంతేగాక పబ్లిక్ మీటింగ్ లో బెదిరించినా.. బీజేపీ అగ్ర నాయకులు స్పందించకపోవడంపై నిరసిస్తూ ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేయడంతో పోలీసులు అడ్డగించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య స్వల్ప విగ్వాధం చోటుచేసుకుంది. కాగా ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు తన్వీన్దర్ సింగ్ ఆరా ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ.. మీ నానమ్మకు పట్టిన గతే నీకు పడుతుందని రాహుల్ గాంధీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేత వ్యాఖ్యలు సరికాదని మండిపడుతున్నారు. అతని బీజేపీ కార్యవర్గం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Similar News