Mallu Ravi: మాజీ ఎమ్మెల్యే ఆదేశాలతోనే కలెక్టర్‌పై దాడి

ప్రజలను రెచ్చగొడుతూ కొడంగల్‌లో కలెక్టర్‌పై దాడి చేయించారని ఎంపీ మల్లు రవి(Mallu Ravi) పేర్కొన్నారు.

Update: 2024-11-12 18:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలను రెచ్చగొడుతూ కొడంగల్‌లో కలెక్టర్‌పై దాడి చేయించారని ఎంపీ మల్లు రవి(Mallu Ravi) పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ దాడి వెనక కొడంగల్(Kodangal) మాజీ ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నదనే అనుమానం ఉన్నదన్నారు. ఆయన ఆదేశాలతోనే దాడిచేసినట్లు స్పష్టమవుతుందన్నారు. తమ వద్ద ఆధారాలన్నీ ఉన్నాయన్నారు. తానే స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాస్తానని వివరించారు. నింధితులపై చర్యలు తీసుకోవాల్సిందేనని నొక్కి చెప్పారు. ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయలని పథకం ప్రకారమే బీఆర్ఎస్(BRS) కుట్రలు చేస్తుందన్నారు. కొడంగల్‌లో భూసేకరణ పై వికారాబాద్ కలెక్టర్ గ్రామస్తులతో సమావేశం అయ్యేందుకు వెళ్లారని, రైతులు ముసుగులో దాడి చేయించారన్నారు.

ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రాకపోవడంతో ఇలాంటి పనులు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. ఇది ప్రజాస్వామ్య పాలనపై జరిగిన దాడి అని గుర్తు చేశారు. కేసీఆర్ వైఫల్యాలపై కాంగ్రెస్ ఎప్పుడు హింస మార్గంలో పోరాటం చేయలేదని వివరించారు. కేటీఆర్ ఢిల్లీ లో బీజేపీ పెద్దలతో చీకటి ఒప్పందం చేసుకుంటున్నాడని స్పష్టం చేశారు. గతంలో బీజేపీ సహకరించిన విషయాలను గుర్తుచేసి అమృత్ భారత్ స్కాం అంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చారన్నారు. బీజేపీ నేతలను రెచ్చగొట్టి, రేవంత్ రెడ్డి పై బురదజల్లే ప్రయత్నం చేశారన్నారు. ఏ ప్రాజెక్టు పనులైన టెండర్లు పిలిచే పనులు అప్పగిస్తారని, ఆధారలుంటే సీబీఐ కి ఇవ్వాలన్నారు. రేవంత్ రెడ్డి సొంత బావమరిది అంటూ కేటీఆర్ ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నానని వివరించారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదన్నారు.

Tags:    

Similar News