CM Revanth Reddy: టీ20 ఫార్మాట్‌కు మారండి.. సొంత నేతలకు సీఎం రేవంత్ సూచన

కాంగ్రెస్(Congress) నేతలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక సూచనలు చేశారు.

Update: 2024-11-12 17:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్(Congress) నేతలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక సూచనలు చేశారు. మంగళవారం ఓ మీడియా ఛానల్‌తో రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాట్లాడారు. రాజకీయాల్లో ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌(T20 Format) నడుస్తోందని.. తమ పార్టీ నేతలు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉందని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టెస్ట్ మ్యాచ్‌లు ఆడటం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. బీజేపీ(BJP) హిట్ ఔట్ లేదా? గెట్ అవుట్ విధానంలో పాలిటిక్స్ చేస్తుందని అన్నారు. ఆ పార్టీ నేతల మధ్య ట్రాన్సాక్షనల్ రిలేషన్స్ మాత్రమే ఉన్నాయని తీవ్ర విమర్శలు చేశారు.

మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు వస్తాయని ప్రచారం చేసుకున్నారు. 240 సీట్లకే పరిమితమయ్యారు.. కాంగ్రెస్‌ 40 నుంచి వంద సీట్లకు చేరింది.. ఈ నెంబర్లు చూస్తే తెలుస్తుంది ఎవరు గెలిచారో అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇది బీజేపీ ఓటమి కాదు.. మోడీ ఓటమి అని తెలిపారు. బీజేపీ రహస్య అజెండా వేరు.. ఎన్నికల అజెండా వేరు అని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. వికారాబాట్ జిల్లాలో కలెక్టర్‌, అధికారులపై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. దాడి వెనుక ఎవరు ఉన్నా ఊచలు లెక్కపెట్టాల్సిందే అని హెచ్చరించారు.

Tags:    

Similar News