TS: ముగిసిన కేబినెట్ భేటీ.. కాసేపట్లో ఆ మీటింగ్ ప్రారంభం
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన 3 గంటల పాటు కీలక అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన 3 గంటల పాటు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6వ తేది నుండి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు పాలనా పరమైన అంశాలు, సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన వజ్రోత్సవాల నిర్వహణ, విద్యుత్ బకాయిలు, పోడు భూముల, రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే యూనివర్సిటీలకు కామన్ రిక్రూట్ మెంట్ బోర్డుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశం ముగిసిపోవడంతో మరి కాసేపట్లో తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రంగ ప్రవేశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అలాగే మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎల్పీ నేతలతో ఏం చర్చించబోతున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేది ఉత్కంఠగా మారింది.