Telangana Budget 2023 : కాంట్రాక్టు ఉద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్
కాంట్రాక్టు ఉద్యోగులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది.
దిశ, వెబ్‌డెస్క్: కాంట్రాక్టు ఉద్యోగులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులది కీరోల్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా అంగన్ వాడీ, ఆశా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఇవ్వడం, దానిని ఏకకాలంలో వర్తింపజేయడం దేశంలోనే ప్రథమమన్నారు. కొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
2014 నుంచి ఫిబ్రవరి 2022 దాకా ప్రత్యక్ష నియామక విధానం ద్వారా 1,61,572 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. వీటిలో 1,41,735 పోస్టుల ప్రక్రియ పూర్తయిందన్నారు. కొత్త ఉద్యోగుల జీతభత్యాల కోసం ఈ బడ్జెట్ లో రూ.1000కోట్లు అదనంగా ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామన్నారు. సెర్ఫ్ ఉద్యోగుల పేస్కేల్ సవరణ చేయబోతున్నట్లు పేర్కొన్నారు.
Read More..
Telangana Budget 2023 : తెలంగాణలో కొత్తగా 60 జూనియర్, సీనియర్ జిల్లా జడ్జి కోర్టులు