T.BJP: మన్మోహన్‌కు సంతాపంగా చివరి నిమిషంలో కీలక నిర్ణయం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) మృతికి తెలంగాణ బీజేపీ(Telangana BJP) సంతాపం తెలిపింది.

Update: 2024-12-27 13:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) మృతికి తెలంగాణ బీజేపీ(Telangana BJP) సంతాపం తెలిపింది. ఆయన మృతితో పార్టీ చేపట్టాలనుకున్న కార్యక్రమాలను వాయిదా వేసుకుంది. ప్రసాద్ ఐమాక్స్(Prasad IMAX) వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించాలని తొలుత బీజేపీ భావించింది. ఈ కార్యక్రమానికి బీజేపీ పార్లమెంట్ సభ్యులు(BJP MPs), శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, కార్పొరేటర్లు, నాయకులు హాజరయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ మన్మోహన్ సింగ్ మృతితో ఈ ప్రోగ్రామ్‌ను వాయిదా వేసుకున్నారు. అలాగే శనివారం చర్లపల్లి టర్మినల్‌ను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్(ashwini vaishnaw) ప్రారంభించాల్సిన కార్యక్రమం కూడా రద్దయింది. ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు.

ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని సంతాపం ప్రకటించారు. ఆర్థిక వేత్తగా, ఒక అధ్యాపడిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఆయన‌ సేవలు మరుచలేనివని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ పవిత్ర అత్మకు శాంతి చేకూరాలని డీకే అరుణ ఆకాంక్షించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Tags:    

Similar News