తెలంగాణ అసెంబ్లీ వాయిదా.. మళ్లీ అప్పుడే!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డారు. శనివారం వాడివేడీ చర్చల తర్వాత ఈ నెల 20వ తేదీ(బుధవారం)కి స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డారు. శనివారం వాడివేడీ చర్చల తర్వాత ఈ నెల 20వ తేదీ(బుధవారం)కి స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు. గవర్నర్ ప్రసంగానికి సభ్యులంతా ఆమోదం తెలిపారు. కాగా, పంచ్ డైలాగ్‌లు, ఘాటైన మాటల తూటాలతో తెలంగాణ అసెంబ్లీ హీటెక్కిపోయింది. తన ప్రసంగాన్ని మొదలుపెట్టడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. 50ఏళ్ల కాంగ్రెస్ పాలనలో విధ్వంసం తప్ప.. ఏముంది చెప్పుకోవడానికి అంటూ కేటీఆర్ మాటల తూటాలు పేల్చారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో విధ్వంసం, రాచరిక పోకడలు అవలంభించారని మండిపడ్డారు. మరోవైపు ఈ నెల 20వ తేదీ నుంచి జరిగే సమావేశాల్లో అయినా కేసీఆర్ పాల్గొంటారా? అని బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.