డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో పలుమార్లు.. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడుతూ వచ్చాయి.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల(Telangana assembly meetings)పై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో పలుమార్లు.. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడుతూ వచ్చాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ నెలతో సంవత్సరం పూర్తి చేసుకోవడంతో.. అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుపై తీవ్ర ఆసక్తి నెలకొంది. అలాగే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి తర్వాత అమలు చేస్తామని.. రైతు భరోసా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి విధివిధానాలు రూపొందిస్తామని తెలిపారు. కాగా డిసెంబర్ 9(December 9) నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు(Winter Sessions of the Assembly) ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళన, హైడ్రా, రైతు భరోసా కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు. ఏ ఏ అంశాలపై సభలో చర్చించాలని నిర్ణయం తీసుకుంటారనే అంశాలపై త్వరలో క్లారిటీ రానుంది.