Rangareddy: చేవెళ్ల మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన
రంగారెడ్డి(Rangareddy) జిల్లా చేవెళ్ల(Chevella) మండలం ఆలూర్ గేటు వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి(Rangareddy) జిల్లా చేవెళ్ల(Chevella) మండలం ఆలూర్ గేటు వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారుల(Small traders) మీదకు లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిరువ్యాపారులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 20 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు ప్రకటించింది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి(Chevella Government Hospital)లో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే కాలే యాదయ్య(Kale Yadaiah), ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy) పరామర్శించారు. త్వరలోనే చేవెళ్ల-బీజాపూర్ పనులు ప్రారంభిస్తామని కీలక ప్రకటన చేశారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.