ఘనంగా టీబీజీకేఎస్ ఆవిర్భావ వేడుకలు

టీబీజీకేఎస్ 21వ ఆవిర్భావ వేడుకలు ఇల్లందులోని అన్ని మైన్స్ & డిపార్ట్మెంట్‌లో ఘనంగా నిర్వహించారు.

Update: 2023-01-27 06:34 GMT

దిశ, ఇల్లందు: టీబీజీకేఎస్ 21వ ఆవిర్భావ వేడుకలు సుదర్శనం రంగనాథ్ అధ్యక్షతన ఇల్లందులోని అన్ని మైన్స్ & డిపార్ట్మెంట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ టీబీజీకేఎస్ ఆవిర్భావం ఒక చారిత్రిక అవసరమైనప్పుడు సంఘం పుట్టిందన్నారు. కేసీఆర్ ఆశీస్సులు, గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సారథ్యంలో కార్మిక వర్గానికి అనేక హక్కులు సాధించామన్నారు. జాతీయ సంఘాలు పోగొట్టిన డిపెండెంట్ ఉద్యోగాన్ని సాధించిన ఘనత టీబీజీకేస్ సంఘానికి దక్కిందన్నారు. టీబీజీకేఎస్ అధ్యక్షులు బి. వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి , వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య వంటి కార్మిక నాయకుల నేతృత్వంలో కోలిండియాలో లేని గృహరుణంపై వడ్డీ, ఉచిత కరెంట్, ఏసీ సౌకర్యం, పిల్లల ఉన్నత చదువులకు ప్రోత్సహాకం, తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, స్పోర్ట్స్ మాస్టర్, పీఎం ఈ మస్టర్ ఇలా అనేక హక్కులు సాధించామన్నారు.

త్వరలో 40 సం. ఉద్యోగ అర్హత, రెండు పేర్ల సర్క్యులర్లు తీసుకురావడానికి సంఘం కృషిచేస్తున్నదని తెలిపారు. కార్మికులకు ఇచ్చిన హామీలను నూటికి నూరుశాతం పూర్తి చేసిన ఘనత సీఎం, టీబీజీకేఎస్ సంఘానిదని అన్నారు. సింగరేణిలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలుపు టీబీజీకేఎస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి అన్ని ఏరియాలలో టీబీజీకేఎస్ జెండా ఎగరవేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ నాయకులు కోటిరెడ్డి, సంజీవరావు, దరియాసిoగ్, జె .వెంకటేశ్వర్లు, చండ్ర, గౌస్, ప్రభాకర్, బొల, రాజు, మేకలశంకర్, రమేష్, పిట్ సెక్రటరీలు అశోక్, జాఫర్, సర్వన్,శ్రీనివాసరెడ్డి, చంద్రయ్య, యాదగిరి, అశోక్, మంగపతిరావ్, మధు, మోయిన్, హరిసిoగ్, మహబూబ్, కోటయ్య, శ్రీను, లక్ష్మణ్, రాము, సాంబ, సంజీవ్, శ్రీను పాల్గొన్నారు.

Also Read...

బీఆర్ఎస్‌లోకి మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు? 

Tags:    

Similar News