Congress: పంట బోనస్‌పై రాష్ట్రవ్యాప్తంగా రైతన్నల హర్షం.. సీఎం కి ధన్యవాదాలు
కాంగ్రెస్(Congress) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు వరికి క్వింటాల్ కు రూ. 500 బోనస్(500 Bonus) ఇస్తున్నారు.
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్(Congress) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు వరికి క్వింటాల్ కు రూ. 500 బోనస్(500 Bonus) ఇస్తున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగిత్యాల జిల్లా(Jagithyala District) కోరుట్ల(Korutla) రైతులు రూ.500 బోనస్ ఇస్తూ.. రైతులకు మేలు చేస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు(Thank You) చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి ఆరోజు మాట ఇచ్చాడు ఈరోజు మాట నిలబెట్టుకున్నాడని, మాకు ఒక 20 క్వింటాలు పండితే బోనస్ కిందే రూ.10 వేలు వస్తున్నాయని, ఈ బోనస్ డబ్బును వచ్చే సీజన్ పంట పెట్టుబడికి ఉపయోగిస్తామని తెలుపుతున్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ కూడా చేయలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress govt) అధికారంలోకి వచ్చకా మాకు రుణమాఫీ(Raithu Runamafi) కూడా అయ్యిందని, ఒక రైతుకు ఇంతకన్నా ఇంకేం కావాలని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐకేపీ సెంటర్లు(IKP Centers) ఏర్పాటు చేసి పంటను మద్దతు ధరకు కొనడమే కాకుండా క్వింటాల్ కు 500 బోనస్ ఇచ్చినందుకు సీఎం రేవంతన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.