T Congress tweet: సీఎం ఫ్యామిలీ అయినా అతీతం కాదు.. హైడ్రాపై టీ కాంగ్రెస్ స్పెషల్ ట్వీట్

హైడ్రా పై తెలంగాణ కాంగ్రెస్ స్పెషల్ ట్వీట్ చేసింది.

Update: 2024-08-31 06:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసిన హైడ్రా మాటే మార్మోగుతున్నది. చెరువులు, కుంటలు, నాళాలు, పార్కులు, ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రాపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. హైదరాబాద్ లో అమలు చేస్తున్న హైడ్రా తరహా వ్యవస్థ మాకూ కావాలంటూ జిల్లాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు హైదరాబాద్ లో అక్రమంగా చెరువులు ఆక్రమించి నిర్మించిన కట్టడాలపైకి హైడ్రా బుల్డోజర్లు పరుగులు తీస్తున్నాయి. ఇటువంటి తరుణంలో హైడ్రాపై టీ కాంగ్రెస్ స్పెషల్ ట్వీట్ చేసింది. గర్జించు హైడ్రా.. గాండ్రించు హైడ్రా అంటూ 2 నిమిషాల నిడివి కలిగిన వీడియోను షేర్ చేసింది. సొంత కుటుంబం సైతం హైడ్రాకు అతీతం కాదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారని ఈ వీడియోలో పేర్కొంది.


Similar News