Congress: ప్రభుత్వాన్ని ఇరికిస్తున్నాననే భ్రమతో తానే ఇరుక్కుపోతున్న హరీశ్ రావు: టీ కాంగ్రెస్

హరీశ్ రావుపై టీ కాంగ్రెస్ సెటైర్ వేసింది.

Update: 2024-08-30 13:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ట్వీట్లపై టీ కాంగ్రెస్ సెటైర్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరికిస్తున్నాననే భ్రమలో హరీశ్ రావు తానే ఇరుక్కుపోతున్నారని ఎద్దేవా చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన తెలంగాణ కాంగ్రెస్.. హరీశ్ రావు తలా తోకా లేని అడ్డదిడ్డమైన ట్వీట్లు వేస్తూ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నామన్న భ్రమలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతున్నారని విమర్శలు గుప్పించింది. పొద్దున లేస్తే బడులు బాగాలేవు, టీచర్లు లేరు, పిల్లలు లేరు అంటూ రోత ట్వీట్లు వేస్తున్న హరిశ్ రావు.. మీ పదేళ్ల పాలనలో టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదని, బడులు బాగు చేయలేదని ఒప్పుకున్నట్లేనా అని ప్రశ్నించింది. 


Similar News